epaper
Friday, January 16, 2026
epaper

మహిళల ఐక్యతకే ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ

మహిళల ఐక్యతకే ‘ఇందిరా మహిళా శక్తి’ చీరల పంపిణీ
మహిళల ఆత్మవిశ్వాసం, అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
మంత్రి పొన్నం ప్రభాకర్

కాకతీయ, కరీంనగర్ : మహిళలను ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో నిలబెట్టడం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో వరుసగా నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మహిళలతో ముచ్చటించారు. చీరల పంపిణీ కేవలం ఒక కార్యక్రమం కాదని, మహిళలు ఐక్యంగా ఉన్నారని తెలియజేసే ఒక సందేశమని పేర్కొన్నారు.చిగురుమామిడి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి మంత్రి చీరలను అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాల సూచనల మేరకే మోడల్ చీరలను ఎంపిక చేశామని చెప్పారు. గ్రామ, మండల సమాఖ్యల నాయకులు బాధ్యతగా వ్యవహరించి ప్రతి మహిళ చేతికి చీర అందేలా చూడాలని కోరారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలన్నింటికీ ప్రభుత్వం వెంటనే స్పందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.మహిళలు ఆర్థికంగా బలపడేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించిన మంత్రి, వడ్డీ లేని రుణాలపై వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోందని, రైస్ మిల్లులు, సోలార్ ప్లాంట్లు, క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, బస్సుల కొనుగోలు వంటి పెద్ద వ్యాపారాల్లోనూ మహిళా సంఘాలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపిన కుటుంబాలే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లు ఇంటింటి సర్వేలో బయటపడిందని, అందుకే విద్యపై మహిళలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.నియోజకవర్గానికి ఇప్పటివరకు 3,500 ఇండ్లు మంజూరయ్యాయని, మరో విడత ఇండ్ల కేటాయింపూ త్వరలో జరగనున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి కూడా ప్రభుత్వమే నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ మహేశ్వర్, డీఆర్‌డీఓ శ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు గందె రజిత పాల్గొన్నారు.సైదాపూర్‌లో మహిళలతో మంత్రి విశాల సహకార పరపతి సంఘం ఫంక్షన్ హాల్‌లో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మహిళలకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉచిత బస్సు, గృహలక్ష్మి, ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించడం వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు గణనీయమైన చేయూతనిచ్చిందని చెప్పారు.18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందేలా సంఘ సభ్యులు కృషి చేయాలని సూచించారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో చేరి ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. త్వరలో సైదాపూర్ మండలంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి క్యాన్సర్ నిర్ధారణ, కంటి పరీక్షలతో సహా మరెన్నో వైద్య సేవలను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్‌డీఓ శ్రీధర్, వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్, సంఘ చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం

మినీ థియేటర్లలో రోడ్డు భద్రత సందేశం సినిమాల మధ్యే ట్రాఫిక్ అవగాహన హెల్మెట్, సీట్‌బెల్ట్‌పై...

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్

మైనారిటీ గురుకులాల్లో అడ్మిషన్లకు గ్రీన్‌సిగ్నల్ ▪️ అడ్మిషన్ పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్...

శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం

శిశుమందిర్ అభివృద్ధికి రూ.1.16 లక్షల విరాళం ఆచార్యుడిగా పనిచేసిన నాయిని చంద్రయ్య ఉదార‌త‌ కాకతీయ,...

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img