పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పాల కేంద్రాలు
ఈ పాలు స్వచ్ఛమేనా? తనిఖీలు ఉండవా ?
ఏదైనా జరిగితేనే చర్యలా ?
కాకతీయ ఖమ్మం టౌన్: స్వచ్చమైనవి తినాలి అలాంటివి మనిషికి మంచి ఆరోగ్యన్ని ఇస్తాయి అయుశ్యుని పెంచుతాయి రోగల బారిన పడకుండా కాపాడుతాయి అని పెద్దలు, డాక్టర్లు, స్కూల్లో టీచర్లు నిత్యం చేపుతునే ఉంటారు. పిల్లలు పెద్దలు వీటిని నిత్యం వింటూనే ఉంటారు. అలా చెప్పే వాటిల్లో మనం ఎక్కువసార్లు వినేవి పాలు ఇవి నిత్యం వాడకం లేని ఇల్లు ఉండదు. ఉదయం లేవగానే పెద్దలు టీ, కాఫీ, పిల్లలు పాలు, మధ్యహన్నం అన్నంలో పెరుగు, నెయ్యి, మజ్జిగ ఇలా పాలు, పాల ద్వారా వచ్చే వాటిని నిత్యం తీసుకుంటుంటాం. ఖమ్మంలో గల్లీకో రెండు న్యాచురల మిల్క్ సెంటర్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ లభించే పాలు స్వచ్చమైనవేనా అనే అనుమానం అందిరిని కలవరపెడుతున్నా చేసేది లేక కొనక తప్పటం లేదు వాడక తప్పటం లేదు. ఖమ్మం నగరానికి చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల నుండి పాలు వస్తున్నాయని మా వద్ద స్వచ్చమైన పాలు , పాల పదార్దాలు లభిస్తాయని అమ్మకాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అనుకున్న స్దాయిలో పాడి పరిశ్రమ రైతలు గుట్టుబాటు ధర రావటం లేదని వచ్చే పాలు స్దానికంగా ఉంటే ప్రజలకు ఇంటి అవసరాలకు సరిపోతున్నాయని వారు చేబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి తక్కువగా ఉంటే గ్రామీణ ప్రాంతాల నుండి నగరానికి పాలు ఎలా వస్తున్నాయనేని చాలా మందికి సమాధనం లేని ప్రశ్న. ఇలా గల్లీకి రెండు , మూడు మిల్క్ సెంటర్లు ఉంటే ఏ రోజైనా వాటిని తనిఖీ చేసి వాటి స్వచ్చతను గమనించిన అధికారులు ఉన్నారా ? కొంత మంది పెద్దవారు గ్రామీణ ప్రాంతాలనుండి మాకు పాలు వస్తున్నాయని ధైర్యంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఖమ్మం నగరంలోని పెద్ద మార్కెట్ దగ్గర చాలా మంతి గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి పాలు పోసే వారు పాల ప్యాకెట్లు కొని వారిని వాళ్ళ క్యాన్‌లలో నింపుకొని తెచ్చి పోసే వారు లేకపోలేదు.
ప్రమాదం ఉంటుందా ?
మనం తాగే కల్తీ పాలవల్ల వెంటనే ప్రమాదం ఉండకపోవచ్చు కానీ ధీర్గకాలికంగా మాత్రం ఖచ్చితంగా ప్రమాంద ఉంటుందని వైద్యులు చేబుతున్నారు. మనం నిత్యం వినియోగించే పాలు ఒక వేళ కల్తీ అయితే మాత్రం వాటి ప్రమాదం మునుముందు రోజుల్లో తీవ్రస్దాయిలో ఉంటుందని, పాలు అంటే పిల్లలు, యవకులు, పెద్దలు, వృద్దులు ఇలా ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఉపయోగించేవి పాలు వాటిని కొన్ని ప్రాంతాల్లో నూనే, యూరియా ఇలా ప్రమాదకరమైన వాటిని వాడి తయారు చేస్తున్నారని వింటున్నాం.
ఏదైనా జరిగితేనా చర్యలా ?
కల్తీ పాలు తాగి ఆరోగ్యం క్షీణించిందని ఏవరానై డాక్టర్ చెప్పినప్పుడు అప్పుడు సంబంధిత అధికారుల బైలు దేరి తనిఖీలు చేసి చర్యలు చేపడతారు. ఇలా ఏదో ఒకచోట ప్రమాదం జరిగి ఏవరో హాస్పటల్ పాలు అయ్యాక చర్యలు చేపట్టి ప్రయోజనం ఏముంటుంది. ఇప్పటికైనా ఒక సారి స్వచ్చతపోరు జరుగుతున్న అమ్మకాలపై తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


