సైబర్ నేరస్తుడి అరెస్టు .. రిమాండ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి ; ఖమ్మం నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి బ్యాంక్ అకౌంట్ నుండి అతడికి తెలియకుండా మొత్తం 11.49 లక్షలు కాజేసిన కేటుగాడిని గురువారం సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. కాజేసిన డబ్బును సైబర్ ఫ్రాడ్ స్టర్ లకు/బెట్టింగ్ యాప్‌లకు సప్లయ్ చేసిన ఏజెంట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన కావలి శ్రీనివాస్ ను స్వగ్రామం అయిన శంకరపల్లె లో అరెస్ట్ చేసి ఖమ్మంకు తీసుకవచ్చారు. ఖమ్మం సైబర్ క్రైమ్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కి తరలించారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించిన సైబర్ క్రైమ్ డీఎస్పీ సీహెచ్ ఫణిందర్ , ఎస్సైలు రంజిత్ కుమార్, విజయకుమార్, కానిస్టేబుల్స్ కృష్ణారావు, ఉదయభాను మూర్తిలను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సీపీ సునీల్ దత్ అభినందించారు.


