- ప్రమాదాల బారిన వాహనదారులు
- పట్టించుకోని ఆర్ అండ్ బీ అధికారులు
కాకతీయ,తుంగతుర్తి : సూర్యపేట జిల్లా తుంగతుర్తి నుంచి వెలుగు పల్లి వెళ్లే రహదారిపై కల్వర్టు గుంతల మయంగా మారింది. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ అండ్ బీ అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వెల్లడిస్తున్నారు. వర్షాలు పడడంతో కల్వర్టు వంతెన పూర్తిగా గుంతల మాయమై వాహనదారులు వ్యవసాయదారులు పెద్దపెద్ద వాహనాలు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. వెలుగు పల్లి సూర్యాపేట తుంగతుర్తి వచ్చే ఆటోలు బస్సులు బైకులు రహదారి గుండా రాక పోకలకు ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని ప్రజలు వేడుకుంటున్నారు.


