పాలేరులో క్రికెట్ జోష్
కరపత్రం ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి
ఈ నెల 9 నుంచి టోర్నమెంట్ ప్రారంభం
కాకతీయ, కూసుమంచి : పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు ఘనంగా తెరలేవనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన కరపత్రాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టోర్నమెంట్‌కు పాలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి జట్లు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ జూకూరి గోపాల్ రావు, మాజీ సర్పంచ్ చాట్ల పరశురాం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి టోర్నమెంట్‌కు హాజరుకావాలని ఆహ్వానించారు. నియోజకవర్గంలో క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహించడంలో మంత్రి సహకారం అందిస్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
గట్టుసింగారం వద్ద పోటీలు గట్టుసింగారం గ్రామ సమీపంలో, పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన మైదాన సదుపాయాలతో పాటు ప్రేక్షకులకు అనువైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. క్రికెట్ టోర్నమెంట్ ద్వారా గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తి పెరిగి, ప్రతిభావంతులైన క్రీడాకారులకు మంచి వేదిక లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.


