కాకతీయ, ఖమ్మం : దేశాన్ని అప్పుల బారిన పడేసి, దేశ సంపదను తన మిత్రులకు కట్ట బెడుతున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాల్సిన అవసరం ఉందని సి పి ఏం పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సిపిఏం 52వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సరితా క్లీనిక్ సెంటర్ లో జాతీయ జెండా ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 68 సంవత్సరాలుగా దేశంలో అన్ని మతాల ప్రజలు ఐక్యంగా జీవించారని, అయితే గత 11 సంవత్సరాలుగా మత ఉన్మాదం పెరిగిందని, దానికి బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లే భాధ్యత వహించాలన్నారు. ప్రజల సొమ్ము లక్షల కోట్ల రూపాయలను అతి తక్కువ ధరలకు అంబానీ, అదానీలకు అప్పగించారని, అమెరికా సామ్రాజ్యవాదానికి తొత్తుగా మోడీ మారారని ఆయన విమర్శించారు.
దేశ ప్రజల సుఖసంతోషాల కోసం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం తప్పనిసరిగా కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఖమ్మం డివిజన్ సెక్రటరీ వై. విక్రమ్, టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, చి. భద్రం, ఎస్‌కే చిన్న హుస్సేన్, మల్లికార్జున్ రెడ్డి, సుభాష్, ఎస్‌కే షఫీ తదితరులు పాల్గొన్నారు.


