epaper
Saturday, November 15, 2025
epaper

బీజేపీ వ్యతిరేక పార్టీలతో పొత్తు

  • బలమైన స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ
  • పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: బిజెపికి వ్యతిరేకంగా కలిసివచ్చే వామపక్ష ప్రజాతంత్ర, లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చవెంకటేశ్వర్లు వెల్లడించారు. సోమవారం స్థానిక మంచికంటి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉందని అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ఆధారంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ కూడా గందరగోళానికి దారితీసిందని ఆరోపించారు. ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచ్ ఎన్నికలకు ఒకే షెడ్యూల్ ఇవ్వడం వలన గందరగోళం నెలకొనే పరిస్థితి ఉందని దీనిపై పునరాలోచించి ఒక ఎన్నిక పూర్తయిన తర్వాత మరొక ఎన్నికకు వెళ్లాలని ఆయన సూచించారు.

బీసీ రిజర్వేషన్ అంశం కోర్టులో ఉన్నప్పటికీ తీర్పు వెళ్ళడైన సందర్భంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలకు తమ సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బీజేపీని ఓడించడానికి కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో ముందుకు వెళ్తామని అన్నారు. బీజేపీతో అధికార భాగస్వామిగా ఉన్న ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. భద్రాద్రి జిల్లాలో తాము 120 సర్పంచ్, 80 ఎంపీటీసీ, 8 ఎంపీపీ, 6 జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నామని ఈ ప్రతిపాదనకు ఒప్పుకునే పార్టీతో కలిసి పోటీ చేస్తామని లేకుంటే తమకు బలం ఉన్న స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన తెలిపారు.

పొత్తు ఉన్నా లేకున్నా సిపిఎం బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తుందని, పార్టీ విధానం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్నికలు సాధనంగా ఉపయోగించుకుంటామన్నారు. గతంలో సిపిఎం గెలిచిన స్థానిక సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దామని ఆదర్శ గ్రామపంచాయతీల అవార్డులు కూడా పొందామని తెలిపారు. ఎన్నికలో గ్రామాల అభివృద్ధికి అంకితమై పని చేస్తున్న సిపిఎంకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కే.బ్రహ్మచారి, లిక్కి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ ప్రజల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img