రౌడీషీటర్లకు కౌన్సిలింగ్
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని ఏసీపీ రమణమూర్తి రౌడీషీటర్లను హెచ్చరించారు.
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి:పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు, చెడు ప్రవర్తన కల్గిన వారిని ఖానాపురం హవెలి పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు.
నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచి నడవడికతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. నేరస్తుల తొందరపాటులో నేరాలు చేసినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
రౌడీషీటర్ అనే పదం తమ బిడ్డల భవిష్యత్‌ను ప్రభవితం చేస్తుందని గ్రహించాలని అన్నారు.నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, ఒకవేళ మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందన్నారు. రౌడీ షీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిగా మారితే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని చెప్పారు
ఆసాంఘిక కార్యక్రమాలు, గొడవలు, దౌర్జన్యాలకు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.
రౌడీ షీటర్ల కదలికలపై ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుని బైండోవర్ చేస్తామన్నారు. పద్దతి మార్చుకోకపోతే పీడీ యాక్ట్ నమోదుచేస్తామన్నారు.
గతంలో ఆసాంఘిక కార్యక్రమాలు, గొడవలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలు పంపించడం జరిగిందని ఈ సందర్బంగా తెలిపారు.


