epaper
Monday, March 2, 2026
epaper

గళం ఎత్తలేని కార్పొరేటర్లు

గళం ఎత్తలేని కార్పొరేటర్లు
కౌన్సిల్ సమావేశాల ఊసే లేదు!
ఖమ్మం కార్పొరేషన్‌లో పరిపాలనలో నిర్లక్ష్యం
నిధులు ఉన్నా పనులు లేవు
సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యంత కీలకమైన కౌన్సిల్ సమావేశాలు సకాలంలో నిర్వహించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నగరంలోని వివిధ సమస్యలపై చర్చించి, నిధుల కేటాయింపుపై తీర్మానాలు చేయాల్సిన ఈ సమావేశాలే లేకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి, నగర సమస్యలను అజెండా రూపంలో చర్చించి, మినిట్స్‌గా నమోదు చేయాలి. గత సమావేశంలో ప్రస్తావించిన అంశాల్లో ఎన్ని పరిష్కారమయ్యాయో తదుపరి సమావేశంలో సమీక్షించాల్సి ఉంటుంది. అయితే ఖమ్మం కార్పొరేషన్‌లో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

గళం ఎత్తలేని కార్పొరేటర్లు

సాధారణంగా డివిజన్లలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి, మేయర్‌, కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. వారు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. కానీ సమావేశాలే లేకపోవడంతో కార్పొరేటర్లు తమ డివిజన్ల సమస్యలను అధికారికంగా చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. నగరంలోని పలు డివిజన్లలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, కుక్కలు–కోతుల బెడద వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ పరిష్కారం దొరకడం లేదు. ఇటీవల ఒక అధికార పార్టీ కార్పొరేటర్ కూడా తన డివిజన్ సమస్యలను నేరుగా కమిషనర్ వద్ద విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిధులు ఉన్నా పనులు లేవు

డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించినప్పటికీ బిల్లులు విడుదల కావడం లేదని కాంట్రాక్టర్లు పనులకు ముందుకు రావడం లేదు. కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందన లేకపోవడం గమనార్హం. కౌన్సిల్ సమావేశం జరిగితే ఈ సమస్యలపై చర్చించి పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 30తో కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగియనుంది. కొత్త ఏడాదిలోనైనా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి, పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు. లేదంటే కార్పొరేషన్ పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img