కార్పొరేటర్లుప్రజల మధ్య ఉండాలి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి
బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులకు ఎంపీ రవిచంద్ర సూచన
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరించిన బీఆర్ఎస్
కాకతీయ,కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎన్నికైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సూచించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్‌లో అధికార పక్షం చేసే తప్పులను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ నిర్ణయం మేరకు బహిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


