కాకతీయ, బయ్యారం : తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రాం రెడ్డి దామోదర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, శనివారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు బానోత్ హరిప్రియ నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చినట్లు బయ్యారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాతా గణేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎన్నో సామాజిక సేవలను అందించారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేవారని కొనియాడారు. ఆయన చివరి శ్వాస వరకు ఎంతోమంది పేదలకు సేవ చేసి ఆదుకున్నారని అన్నారు. రాంరెడ్డి బ్రదర్స్ అంటే తెలియని వారు ఉండరని, తెలుగు రెండు రాష్ట్రాలలో పేరు ప్రతిష్టలు ఉన్న నాయకులని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బయ్యారం మండల ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.


