epaper
Friday, November 14, 2025
epaper

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం

యువతలో కొత్త జాగృతి ప్రేరణనే చైతన్యం
డ్రగ్స్ పై యుద్ధం ముగింపు ర్యాలీ
ప్రజల భాగస్వామ్యం సంతోషకరం..జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్

కాకతీయ, కొత్తగూడెం రూరల్: యువత మత్తు పదార్థాలను వీడి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన డ్రస్పై యుద్ధం చైతన్యం కార్యక్రమంలో ప్రజలు సంపూర్ణంగా భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషకరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్రంగా శుక్రవారం లక్ష్మిదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుండి ప్రకాశం స్టేడియం వరకు పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో అక్టోబర్ 15 వ తేదీ నుండి శుక్రవారం నెల రోజుల పాటు చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం పేరుతో అనేక అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారన్నారు.​ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి పాటిల్ వసంత్,జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్,ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యలు పాల్గొన్నారు.

ఈ నెల రోజుల ప్రచార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం యువతను, విద్యార్థులను మాదక ద్రవ్యాల (డ్రగ్స్) కోరల నుండి రక్షించడం, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమగ్ర అవగాహన కల్పించడం.జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామాలు ముఖ్యంగా విద్యా సంస్థలు,కళాశాలల్లో పోలీసు అధికారులు,సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహనా సదస్సులు,ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయన్నారు. విద్యార్థులు,యువత,తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రజా ప్రతినిధులను ఈ అవగాహనా కార్యక్రమాల్లో భాగం చేశారు.ఈ ముగింపు సభలో సుమారుగా 5000 మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారనీ.పాల్గొన్న వారందరికీ ఆయా స్కూల్లు,కళాశాలల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి అలరించారు.

డ్రగ్స్ వాడకం అనేది వ్యక్తిగత సమస్య కాదని,ఇది సామాజిక రుగ్మత అని,దీనిపై పోలీసులతో పాటు ప్రతి పౌరుడు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.భవిష్యత్తులో కూడా ఈ చైతన్యం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.ముగింపు వేడుకలో చురుకుగా పాల్గొన్న విద్యార్థులకు,స్వచ్ఛంద సంస్థలకు,జిల్లా ప్రజలకు,ప్రజాప్రతినిధులకు,అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.​జిల్లాను డ్రగ్స్ రహిత భద్రాద్రి గా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని,డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ధైర్యంగా తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.

డ్రగ్స్ సమస్య కేవలం చట్టాన్ని అమలు చేసే సమస్య కాదని,ఇది సామాజిక,ఆర్థిక అభివృద్ధికి పెద్ద అవరోధమని పేర్కొన్నారు.డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం (విద్య, వైద్యం, సంక్షేమం) చురుగ్గా పాల్గొనాలని చెప్పారు.జిల్లాలోని విద్యా సంస్థలు హాస్టళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాలని,అనుమానాస్పద కార్యకలాపాల గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిర్భయంగా అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా ఉండేందుకు క్రీడలు,కళలు,సాంస్కృతిక కార్యక్రమాలు వంటి సానుకూల ప్రత్యామ్నాయాలను అలవాటు చేసుకుని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువత సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.డ్రగ్స్ బారిన పడిన వారికి సరైన చికిత్స మరియు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

డ్రగ్స్ నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు,నేరస్తులకు విధించే శిక్షలు మరియు న్యాయ వ్యవస్థ పాత్ర గురించి వివరించారు.మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన చట్టం ఎంత కఠినంగా ఉంటుందో వివరించారు.​డ్రగ్స్ తయారీ,సరఫరా,విక్రయం మరియు వాడకం అనేది క్షమించరాని నేరం అని చెప్పారుఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణ గౌడ్,అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,జిల్లా రవాణాధికారి వెంకటరమణ,సూపరింటెండెంట్ జానయ్య,మున్సిపల్ కమీషనర్ సుజాత,డిఎస్పీలు రెహమాన్,చంద్రభాను,రవీందర్ రెడ్డి,సతీష్ కుమార్,మల్లయ్యస్వామి,అశోక్,సత్యనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

ఎన్ డి ఎ కూటమి విజయం

ఎన్ డి ఎ కూటమి విజయం హర్షం వ్యక్తం చేసిన బీజేపీ మండల...

భళారే.. యమ

భళారే.. యమ పిల్లల పండుగ రోజున అలరించిన బుడతడు కాకతీయ కొత్తగూడెం రూరల్: బాలల...

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట…

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభాల పంట... రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార, చేనేత...

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం

కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని కి మాతృవియోగం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: జిల్లా కాంగ్రెస్ నాయకుడు,...

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి

టీబీ వ్యాధి పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డాక్టర్ దుర్గాభవాని కాకతీయ, పినపాక:...

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది…

సమాజ నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది... పిల్లలను స్వేచ్ఛగా వివక్షతరహితంగా పెంచాలి... స్మార్ట్ కిడ్జ్...

ఆదివాసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఆదివాసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి వలస ఆదివాసి గ్రామం పిట్టతోగులో సెంట్రల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img