ప్రజా సంక్షేమ పథకాలతోనే కాంగ్రెస్ గెలుపు
అత్యధిక పంచాయతీలు కాంగ్రెస్ వే
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారని ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మంత్రివర్గ సభ్యుల సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతుందని అన్నారు. ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పల్లెల్లో ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కడుతున్నారని అన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పం చ్ లకు, ఉప సర్పంచ్ లకు,వార్డ్ మెంబర్ లకు అభినందనలు తెలిపారు,అదేవిధంగా గెలిచిన సర్పంచ్ లు ప్రజాపాలనను ప్రజలకు ఇంకా చేరువచేస్తూ పార్టీ ప్రిష్టతకు తోడ్పడాలని, మిగిలి ఉన్న రెండు దశల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలవబోతున్నారని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునివలె పని చేయాలని కోరారు


