- కేసులో ఖచ్చితంగా విజయంసాధిస్తాం..
- హైకోర్టులో ప్రభుత్వం నుంచి బలంగా వాదనలు..
- 1930 తర్వాత తెలంగాణలో కుల గణన..
- నోటి కాడ ముద్దను లేగే ప్రయత్నం చేయొద్దు
- పీసీసీ ఛీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు తెలపాలి
- రాజీకీయాలకు అతీతంగా ఏకంకావాలి: పొన్నం ప్రభాకర్
- బీసీ రిజర్వేషన్లపై తగ్గేది లేదు.. వాకిటి శ్రీహరి
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల కేసు ఖచ్చితంగా గెలుస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లపై తమ లాయర్లు హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారన్నారు. రేపు యథావిధిగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ వేయాలన్నారు. 1930 (దాదాపు 90 సంవత్సరాల) తరవాత తెలంగాణలో కుల సర్వే జరిగింది. బీజేపీ బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తోంది. బీసీల కోసం మూడు చట్టాలు తీసుకొచ్చాం. బిల్లుకి అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తుంది. కుల, మతాలకు అతీతంగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతి నిధులు మద్దతు తెలిపారు. రానున్న స్థానిక ఎన్నికల్లో 90 శాతం స్థానాలను గెలుచుకుంటాం.. అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
మాట నిలుపుకుంటాం..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ వెనక్కి తగ్గేదిలేదని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. కొన్ని రోజులుగా రిజర్వేషన్ల పక్రియలో ఏం మార్పులు వచ్చాయో, మా పార్టీ ఏం స్టాండ్ తీసుకుంది అనేది ప్రజలందరికీ తెలుసు అన్నారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామంటే కొన్ని పార్టీల నాయకులు నవ్వారన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుంది, పక్కదారి పట్టిస్తున్నారు అని ఆరోపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గదన్నారు. అది తెలంగాణ రాష్ట్రం విషయంలో కానీ…. రిజర్వేషన్ల విషయంలో కానీ స్ఫస్టం అయిందన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చడం మా పార్టీ స్టాండ్.. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు వరకు నేను, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి బీసీల వాదన విన్పించాం. ఈరోజు హై కోర్టులో కూడా ప్రభుత్వం వాదన బలంగా వినిపించాం. ఇచ్చిన మాట నిలపెట్టుకోవాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అని శ్రీహరి అన్నారు.
ఆపార్టీలు కలిసిరావాలి: పొన్నం ప్రభాకర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వం తరుపున మా వాదనలు బలంగా వినిపించాం అన్నారు. దేశంలో తొలి రాష్ట్రంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. సభలో మీరు మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టంగా మద్దతు ఇచ్చారన్నారు. బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు కోసం రాజకీయాలకు పోకుండా ఐక్యంగా ఉండాలని కోరారు. అసెంబ్లీ చర్చల్లో సభ ఏకగ్రీవ తీర్మానంపై జరిగింది
కోర్టులో అఫిడవిట్ లు ఉండవు ఇంప్లీడ్ కావాలని కోరాం.. కుల సర్వే లో మీరు పాల్గొనలేదు.. ప్రజలు 97 శాతం సర్వేలో పాల్గొన్నారు. ఎంపైరికల్ డేటా కు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి సబ్ కమిటీ వేసుకొని 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం.. రాజకీయాలు పక్కన పెట్టి సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు కోర్టులో బీజేపీ, బీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలి.. అని మంత్రి అన్నారు.


