మున్సిపల్ చైర్మన్ ఎన్నికలకు కాంగ్రెస్ విప్‌ల నియామకం
ఐదు మున్సిపాలిటీలకు టీపీసీసీ ఆదేశాలు
పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సూచన
కాకతీయ, ఖమ్మం : జిల్లా లోని ఐదు మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల కోసం టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విప్‌లను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల ఎన్నికను సాఫీగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏదులాపురం మున్సిపాలిటీ విప్‌గా తుంబూరు దయాకర్ రెడ్డి, మధిర మున్సిపాలిటీ విప్‌గా కోనా ధనికుమార్, వైరా మున్సిపాలిటీ విప్‌గా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కల్లూరు మున్సిపాలిటీ విప్‌గా పొంగులేటి ప్రసాదరెడ్డి, సత్తుపల్లి మున్సిపాలిటీ విప్‌గా ఎమ్మెల్యే మట్టా రాగమయి నియమితులయ్యారు. పార్టీ విప్‌ల సూచనల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులను చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఎన్నుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించిన నాయకులు, కార్యకర్తలు, ఓటర్లకు నూతి సత్యనారాయణ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు


