- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
కాకతీయ, మణుగూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసే మోసాలను ఎండగట్టాలని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, పినపాక మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు అన్నారు. మంగళవారం మణుగూరు మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రేగా మాట్లాడుతూ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులను స్థానిక సంస్థల్లో ఓట్లు అడగడం కోసం ఇంటికి వస్తే తగిన ప్రశ్నలు అడగాలన్నారు. గతంలో చేసిన మోసాలు సరిపోక మళ్ళీ మరొకసారి మోసం చేయడానికి వస్తున్నారా విమర్శించారు.
మునుపెన్నడూ లేని విధంగా యూరియా కొరతతో రైతన్నల ఆశలు అడియాసలు అయ్యాయన్నారు. యూరియా కొరత ఏర్పడటంతో రైతులు వేసిన వివిధ రకాల పంటల్లో యూరియా అందక దిగుబడి క్షీణించిందన్నారు. ఇప్పటికైనా అధికార కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మణ్, పార్టీ నాయకులు ఎడ్ల శ్రీను, వట్టం రాంబాబు, ఆడప అప్పారావు, యూసఫ్ షరీఫ్, యాదగిరి గౌడ్, ప్రభుదాస్, అక్కి నరసింహారావు, వేల్పుల సురేష్, గువ్వ రాంబాబు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్
కాకతీయ, పినపాక : కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయం వద్ద స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


