హుస్నాబాద్‌లో కాంగ్రెస్ హవా..
తొలి 7 వార్డుల్లో వరుస విజయాలు
ప్రారంభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు
మొదటి ఏడు వార్డుల్లో హస్తం జెండా ఎగురవేత
ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన వరుస విజయాలు
మున్సిపాలిటీపై కాంగ్రెస్ పట్టు బలపడే సంకేతాలు
కాకతీయ, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వరుసగా ఏడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి షాక్ ఇచ్చారు. ప్రారంభ రౌండ్ల నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతతో గెలుపొందుతూ మున్సిపాలిటీపై తమ పట్టు బలంగా ఉందని చాటుతున్నారు. 1వ వార్డులో చెన్నమనేని అనూష విద్యాసాగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 2వ వార్డులో బూరుగు లత కిస్టస్వామి, 3వ వార్డులో కొండ రజిత సత్యనారాయణ కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలుపొందారు. 4వ వార్డులో పిల్లి తిరుపతి విజయం సాధించగా, 5వ వార్డులో బొలిశెట్టి రాజు కాంగ్రెస్ ఖాతాలో విజయాన్ని నమోదు చేశారు. 6వ వార్డులో భూక్యా సంపత్ నాయక్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందగా, 7వ వార్డులో చిత్తారి పద్మ రవీందర్ విజయం సాధించారు. ఈ వరుస విజయాలతో హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ మున్సిపాలిటీ కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఇంకా మిగిలిన వార్డుల ఫలితాలు రావాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతుందా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.


