హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్
20 వార్డులకు 20 మంది అభ్యర్థుల ఖరారు
మంత్రులు పొన్నం–తుమ్మల సూచనలతో తుది జాబితా విడుదల
కాకతీయ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితాను పార్టీ అధిష్టానం ప్రకటించింది. హుస్నాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, అన్ని వార్డులకు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేసింది.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా:
1వ వార్డు: చెన్నమనేని అనూష విద్యాసాగర్
2వ వార్డు: బూరుగు లత కిష్టస్వామి
3వ వార్డు: కొండా రజిత సతీష్
4వ వార్డు: పిల్లి తిరుపతి
5వ వార్డు: బోలిశెట్టి రాజు
6వ వార్డు: భూక్యా సంపత్ నాయక్
7వ వార్డు: చిత్తరి పద్మ రవీందర్
8వ వార్డు: కాశావేణి సరిత
9వ వార్డు: సావుల రాజయ్య
10వ వార్డు: సావుల మంజుల
11వ వార్డు: పూదరి వరప్రసాద్
12వ వార్డు: కాశావేణి రమేష్
13వ వార్డు: పచ్చిమట్ల శ్రీకాంత్
14వ వార్డు: దండి లక్ష్మి కొమురయ్య
15వ వార్డు: ఆకుల రజిత వెంకన్న
16వ వార్డు: వైద్యం కిరణ్ ప్రసాద్
17వ వార్డు: కేడం లింగమూర్తి
18వ వార్డు: అయిలేని అనిత రెడ్డి
19వ వార్డు: బత్తుల స్వరూప రవీందర్
20వ వార్డు: గోపగాని శోభన్ బాబు
హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ జాబితాను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. త్వరలోనే బీ-ఫామ్ల పంపిణీ పూర్తి చేసి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.


