epaper
Thursday, January 15, 2026
epaper

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం
ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు
పాలమూరుకు మరణశాసనం రాసింది కాంగ్రెస్సే
కాళేశ్వరంపై కక్ష.. ప్రాజెక్టులపై కుట్ర
ఉత్తమ్‌ కట్టుకథలు.. రేవంత్‌ పిట్టకథలు
కాంగ్రెస్ పార్టీయే తెలంగాణకు నెంబర్‌వన్‌ విలన్‌
కేసీఆర్ అన్న మాట‌లు నేడు అక్ష‌ర స‌త్య‌మ‌వుతున్నాయి..
తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : నదీ జలాల్లో తెలంగాణ‌కు అన్యాయం వెనుక కాంగ్రెస్ ద్రోహ‌మే ఉంద‌ని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నదీజలాల పంపిణీ- ప్రాజెక్టుల రూపకల్పనపై హ‌రీష్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ఈసంద‌ర్భంగా హ‌రీష్‌రావు మాట్లాడుతూ నదీజలాల పంపిణీ నుంచి ప్రాజెక్టుల రూపకల్పన వరకూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసింద‌ని పేర్కొంటూ.. గణాంకాలు, డాక్యుమెంట్లతో ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. తెలంగాణకు అన్ని విధాలుగా నష్టం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఫజల్‌ అలీ కమిషన్‌ తెలంగాణను ప్రత్యేకంగా ఉంచాలని సూచించినప్పటికీ, కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేసిందని హరీశ్‌రావు అన్నారు. విభజన సమయంలోనూ నీళ్లు, ప్రాజెక్టుల విషయంలో మనకు తీరని అన్యాయం జరిగిందన్నారు. 11వ షెడ్యూల్‌లో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును చేర్చకుండా కాంగ్రెస్‌ కావాలనే నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.

పాలమూరుపై కాంగ్రెస్‌ పగ

పాలమూరు ప్రాంతానికి మరణశాసనం రాసిందే కాంగ్రెస్‌ అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజన తర్వాతనూ పాలమూరును కావాలనే నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్‌, టీడీపీ ద్రోహం చేస్తే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి అదే ద్రోహాల పరంపర కొనసాగిస్తున్నారని అన్నారు. నిపుణుల సహకారంతో కేసీఆర్‌ కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులను రూపకల్పన చేశారని తెలిపారు. రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పాడైందన్నట్టు చిత్రీకరించారని విమర్శించారు. రూ.100–200 కోట్లు ఖర్చు పెడితేనే 5–6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉందని, కానీ రెండేళ్లుగా కాళేశ్వరంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రైతాంగంపై, ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్‌ పగబట్టిందని ఆరోపించారు.

తొమ్మిదిన్నరేళ్లలో 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయ‌క‌ట్టు..

ఉమ్మడి రాష్ట్రంలో 1956 నుంచి 2004 వరకు కేవలం 36 లక్షల ఎకరాల ఆయకట్టే వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 5 లక్షల 71 వేల ఎకరాలే అన్నారు. అదే బీఆర్‌ఎస్‌ పాలనలో తొమ్మిదిన్నరేళ్లలో 17 లక్షల 24 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, మొత్తం 48 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టు సాధించామని వివరించారు. కాంగ్రెస్‌ పదేళ్ల పాలనలో స్టెబులైజేషన్‌ 93 వేల ఎకరాలకే పరిమితమైతే, బీఆర్‌ఎస్‌ పాలనలో 31 లక్షల 50 వేల ఎకరాల స్టెబులైజేషన్‌ సాధించామని చెప్పారు. చెరువులను పట్టించుకోని కాంగ్రెస్‌కు భిన్నంగా మిషన్‌ కాకతీయ ద్వారా 25 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ స్టేజ్‌–2కు కాళేశ్వరం నీళ్లు అందించిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్పారని, నదీజలాల విషయంలో కాంగ్రెస్‌ చేసిన ద్రోహాలు ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతాయని హరీశ్‌రావు అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img