- ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గ
కాకతీయ, ఇనుగుర్తి: పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గ బాలింతలకు గర్భిణీలకు తల్లులకు పిల్లలకు సూచించారు. మండల కేంద్రంలో ఇనుగుర్తి సెక్టార్ అంగన్వాడీ పోషణ మాసం కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ అందుబాటులో ఉండే ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, నువ్వులు, బెల్లం తదితర పోషకాహారాలను తీసుకోవాలన్నారు. చక్కెర నూనె వాడకం తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు కవిత, అల్లిక అంగన్వాడి టీచర్లు పద్మ , లక్ష్మి , సుజాత , సునీత , జ్యోతి , భారతి, మమత, సంగీత, సునీత ఆశాలు తదితరులు పాల్గొన్నారు.


