కూసుమంచిలో కన్నుల పండుగగా పోటీలు
విజేతలకు బహుమతులు ప్రదానం
కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు శనివారం కన్నుల పండుగగా నిలిచాయి. గ్రామ మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేసిన రంగవల్లులు అందరినీ ఆకట్టుకున్నాయి. గ్రామ సర్పంచ్ కొండా కృష్ణవేణి, మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు గుండా స్రవంతి, వార్డు సభ్యులు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 64 మంది పాల్గొన్న ఈ పోటీల్లో ఎలగందుల నజీమకు ప్రథమ, కంది నాగమణికి ద్వితీయ, సండ్ర పుష్పలతకు తృతీయ బహుమతులు లభించాయి. పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


