epaper
Monday, March 2, 2026
epaper

కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి

కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలి
జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్

కాకతీయ, కొత్తగూడెం : సింగరేణిలో కారుణ్య నియామకాలు, టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ నుంచి అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల వివరాలు, ఇప్పటికే కారుణ్య నియామకం పొందిన ఉద్యోగుల వారసుల వివరాలను ఈపీఆర్‌లో నమోదు చేసే ప్రక్రియ పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అంశాల్లో జాప్యం సహించబోమని స్పష్టం చేశారు.

నెలవారీ నివేదికలు సకాలంలో పంపాలి

క్వార్టర్స్ స్థితిగతులు, నెలవారీ క్వార్టర్ కౌన్సెలింగ్ విధానం, గ్రాట్యుటీ చెల్లింపులపై సమీక్ష నిర్వహించారు. కారుణ్య నియామకాలు, టెర్మినల్ బెనిఫిట్స్, క్వార్టర్ కౌన్సెలింగ్, గ్రాట్యుటీ అంశాలకు సంబంధించి నెలవారీ నివేదికలను తప్పనిసరిగా సకాలంలో పంపాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు సీఎంపీఎఫ్–సీపీఆర్‌ఎంఎస్‌కు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని సింగరేణి మాజీ ఉద్యోగులు, తమ మొబైల్ ఫోన్‌లోని ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా లేదా స్వయంగా సీఎంపీఎఫ్–సీపీఆర్‌ఎంఎస్ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. అవసరమైతే సమీప మీసేవ కేంద్రాల్లో కూడా సర్టిఫికెట్ అందజేయవచ్చని, తద్వారా పెన్షన్, వైద్య సేవలు నిరాటంకంగా పొందవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జీఎం (పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.వి. కిరణ్‌కుమార్‌తో పాటు డీజీఎం(పర్సనల్)లు బి. శివకేశవరావు, ముకుంద సత్యనారాయణ, డీవైపీఎం కె. సునీల్ కుమార్, సీనియర్ పీఓ ఎం. శ్రీనివాస్, కమ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్. సుజ్ఞాన్, అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్‌మెంట్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img