epaper
Monday, March 2, 2026
epaper

సంక్రాంతి వేడుకలకు కమ్యూనిస్టు టచ్

సంక్రాంతి వేడుకలకు కమ్యూనిస్టు టచ్
సిపిఐ శత దినోత్సవాల్లో ముగ్గుల సందడి
శేషగిరి నగర్‌లో మహిళలకు రంగుల పోటీలు
మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత దినోత్సవాల సందర్భంగా, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామంలో మహిళా సమాఖ్య, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ, సిపిఐ ఆధ్వర్యంలో రంగురంగుల ముగ్గుల పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామమంతా పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, చాతకొండ సర్పంచ్ ఈశ్వరి, మహిళా సమాఖ్య నాయకురాళ్లు హాజరయ్యారు. ముగ్గుల పోటీలకు జడ్జీలుగా కామ్రేడ్ మునిగడప పద్మ, సింగరేణి సేవా సమితి నాయకురాలు మునిల వ్యవహరించారు.

మహిళల ఉత్సాహం.. గ్రామమంతా పండుగ కళ
రంగురంగుల ముగ్గులతో మహిళలు తమ కళా ప్రతిభను ప్రదర్శించడంతో శేషగిరి నగర్ పండుగ కళను సంతరించుకుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు కరిష రత్నకుమారి మాట్లాడుతూ.. గ్రామ మహిళల ఉత్సాహం అభినందనీయమని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్నా లక్ష్మీకుమారి మాట్లాడుతూ, జనవరి 18న ఐదు లక్షల మందితో నిర్వహించనున్న సిపిఐ భారీ బహిరంగ సభకు మహిళలందరూ పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. మహిళలకు చైతన్యవంతమైన సందేశం అందించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులను ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, మహిళా సమాఖ్య నాయకురాళ్లు, నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు ధర్మ, రాములు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాకాల లక్ష్మి, రేణిగుంట్ల లక్ష్మి, బానోతు శాంతి, గుంటి సునీత, మంద విజయనిర్మల, మేదిని లక్ష్మి, ఎస్.కె. షాహిన్, మద్దెల విజయలక్ష్మి, వెంకట నరసమ్మ, పొలమూరి ధనలక్ష్మి, ఎస్‌డీ కైసర్, రమ, దేవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img