epaper
Monday, March 2, 2026
epaper

కదం తొక్కుతూ కదలి రండి!

కదం తొక్కుతూ కదలి రండి!
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు త‌ర‌లిరావాలి
జనవరి 18న భారీ బహిరంగ సభ
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి

కాకతీయ, ఖమ్మం : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న ఖమ్మంలో నిర్వహించనున్న నేపథ్యంలో నగరంలో ప్రచారం హోరెత్తింది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వందేళ్లుగా సీపీఐ పనిచేస్తోందని, అధికార యావ లేకుండా ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీనేనని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు వేలాది మంది కదం తొక్కుతూ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం నగరంలో నిర్వహించిన జీపుజాతాలో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్, గ్రెయిన్ మార్కెట్, పాత బస్టాండ్, ముస్తఫానగర్, రోటరీ నగర్, రామన్నపేట, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన సభల్లో సీపీఐ నేతలు ప్రసంగిస్తూ శతాబ్ది ఉత్సవాల ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్భంగా జమ్ముల జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం జరిగిన ఆ మహోద్యమం తెలంగాణ ప్రజల జీవితాల్లో చైతన్యాన్ని నింపిందని చెప్పారు. భూ సంస్కరణల చట్టం, దున్నేవాడికే భూమి నినాదం, బ్యాంకుల జాతీయకరణ, జాతీయ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి అనేక విజయాలు కమ్యూనిస్టు ఉద్యమం సాధించిందని జితేందర్‌రెడ్డి గుర్తుచేశారు. 2024 డిసెంబర్ 26 నుంచి దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని, వాటి ముగింపు సభ ఖమ్మంలో జరగడం గర్వకారణమన్నారు. ఖమ్మం నగరం ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని, దశాబ్దాలుగా వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరిస్తున్నారని సీపీఐ నేతలు పేర్కొన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జనవరి 18న జరిగే శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని నగర ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు శింగు నర్సింహారావు, రాష్ట్ర సమితి సభ్యులు ఎస్.కె.జానిమియా, మహ్మద్ సలాం, కొండపర్తి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, సిహెచ్.సీతామహలక్ష్మి, పగడాల మల్లేష్, ఏనుగు గాంధీ, యానాలి సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆరెంపుల సతీష్, పల్లెసుద్దుల శ్రీను, మనోజ్, చందర్రావు, శ్రీకాంత్, శాంతి, మృతేష్ తదితర కళాకారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img