- ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కాకతీయ, పినపాక : సీఎంఆర్‌ఎఫ్ పేదలకు వరమని, పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ అనారోగ్య కారణాలతో పినపాక మండలానికి చెందిన పలువురు సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కులను అందజేశామని తెలిపారు. అనంతరం వారితో మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నిరుపేదల వైద్యం ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఆర్థికంగా అండగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమం అందుతుందన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ గోపాల కృష్ణ, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీవో వెంకటేశ్వరరావు, హౌసింగ్ ఏఈ గుమ్మడి వినీత, ఏపీవో వీరభద్రస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రామనాథం, మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ కబడ్డీ నిర్వహణపై ఉపాధ్యాయులతో సమావేశం
నేషనల్ కబడ్డీ క్రీడల నిర్వహణకు పినపాక మండల పరిధిలో గల ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాల ఎంపిక కావటం గర్వకారణమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ బయ్యారం జడ్పీ పాఠశాల గ్రౌండ్ పరిశీలించి అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. జాతీయస్థాయి క్రీడలు కావున ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.


