కాకతీయ, కొత్తగూడెం : చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రులలో పలు వ్యాధులతో చికిత్స పొందిన 12 మంది లబ్ధిదారులకు 3 లక్షల 58వేల రూపాయిల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి, పెద్దబాబు, పాల్వంచ సోసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, భద్రాద్రి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, పలు ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి వీలైనంత త్వరగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందేలా చేశారని, అంతేకాక అనునిత్యం కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అందించడంలో ఆయన చేస్తున్న కృషి చేస్తున్నారన్నారు. ఎంతో మంది సకాలంలో చికిత్స పొందలేక ప్రైవేట్ ఆస్పత్రిలలో అప్పులు చేసి, ఖర్చు పెట్టుకున్న బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దమ్మగుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరావు, రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్, ఆర్టీఐ బోర్డు సభ్యులు జోషి, సుజాతనగర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కాంగ్రెస్ నాయకులు బాల పాసి, కేకే శ్రీను, జానీ భాయ్, తలుగు అనిల్, కున్సోత్ కిషన్, సుందర్ లాల్ కోరి, పూనెం శ్రీను, ఐవైసి నియోజకవర్గ అధ్యక్షులు పాల సత్యనారాయణ రెడ్డి, జిల్లా కార్యదర్శి గులాం మతిన్, తదితరులు పాల్గొన్నారు.


