epaper
Monday, March 2, 2026
epaper

త్వరలో భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం రాక

త్వరలో భద్రాద్రి కొత్తగూడెంకు సీఎం రాక
కొత్తగూడెం లో మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ ప్రారంభోత్సవానికి రండి
సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల ఆహ్వానం
డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు
పకడ్బందీ ఏర్పాట్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

కాకతీయ, కొత్తగూడెం రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆహ్వానించారు.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి తుమ్మల కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఖచ్చితంగా జిల్లా పర్యటనకు వస్తానని పేర్కొన్నారు.

డిసెంబర్ మొదటి వారంలో పర్యటన ఖరారు

మంత్రి తుమ్మల ఆహ్వానం మేరకు సీఎం రేవంత్ స్పందిస్తూ డిసెంబర్ 1 నుండి 8 వరకు ఏ తేదీనైనా కార్యక్రమాన్ని చేపట్టొచ్చు. అనుకూలమైన రోజు నిర్ణయించుకుని తెలియజేస్తానని సూచించారు.
దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది.

ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలని ఆదేశం

సీఎం రానున్న విషయం ఖరారైన వెంటనే మంత్రి తుమ్మల, విద్య శాఖ సెక్రటరీ శ్రీధర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు, సంబంధిత శాఖలకు తక్షణమే కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమ వేదిక, స్టేజ్, లేఅవుట్ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రోడ్డు, వసతులు, పార్కింగ్, రాకపోకలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని,భద్రత విషయాల్లో లోపాలు లేకుండా పోలీసు శాఖతో సమన్వయంతో పని చేయాలన్నారు. అతిథుల నిర్వహణ, వసతి, మీడియా సెంటర్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచించారు. విశ్వవిద్యాలయ భవనాలు, ల్యాబ్‌లు, మౌలిక వసతుల పరిశీలనకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

దేశానికే ప్రత్యేక గుర్తింపునిచ్చే వర్సిటీ

కొత్తగూడెం మైనింగ్ విశ్వవిద్యాలయం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా మారనుందని మంత్రి తుమ్మల తెలిపారు.300 ఎకరాల్లో నిర్మించిన ఈ వర్సిటీ, ఇప్పటికే ఆధ్యునిక ల్యాబ్‌లు, పరిశోధన కేంద్రాలు, అంతర్జాతీయ ప్రమాణాల విద్యా వసతులతో నిర్మించారు.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ విద్యా రంగం జాతీయస్థాయిలో కొత్త గుర్తింపు పొందనుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల కృషితోనే సాధ్యమైన ప్రాజెక్ట్

మైనింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేయడం, దానికి భారత మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ పేరును నిర్ణయించడం మంత్రి తుమ్మల నిరంతర కృషి వల్లే సాధ్యమయ్యాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జిల్లా అభివృద్ధికి తనదైన శైలిలో పని చేస్తున్న తుమ్మల కృషికి ప్రజలు, విద్యారంగ నిపుణులు అభినందనలు తెలియజేస్తున్నారు.

యువతకు ఉపాధి – జిల్లాకు అభివృద్ధి

వర్సిటీ ప్రారంభోత్సవం నేపథ్యంలో వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు,యువతకు పరిశోధనా, ఉపాధి అవకాశాలు,కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, పరిశోధన సంస్థలు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు. జిల్లాలో విద్య–పరిశ్రమల సమన్వయంతో ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img