ఘనంగా ప్రారంభమైన సీఎం కప్ పోటీలు
కాకతీయ , కూసుమంచి : కూసుమంచి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సీఎం కప్ 2025-26 మండల స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా ఎంపీడీఓ జీ జశ్వంత్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పోటీలు మన మండలంలోని వివిధ గ్రామాలలోని ప్రతిభావంతులను గుర్తించి వారి ప్రతిభను బయటకి తీయడం కోసం నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌత్ కొరియా పర్యటన లో భాగంగా మాట్లాడిన 5 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 మెడల్స్ సాధించగా 147 కోట్ల జనాభా ఉన్న మన దేశంకి ఇంకెన్ని మెడల్స్ రావచ్చునో ఆలోచించాలని చెప్పిన మాటలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే కేవలం మండల, రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో కూడా ప్రతిభను చూపించాలనీ ఆకాంక్షను వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ టి జశ్వంత్ కుమార్ ,కూసుమంచి సర్పంచ్ కృష్ణ వేణి మహిపాల్ ,మండల విద్యాశాఖ అధికారి ఆర్ వీరస్వామి, కూసుమంచి అదనపు ఎస్ఐ దివ్య , వివిధ గ్రామాల సర్పంచులు ,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు..


