సిఐటియు ఆధ్వర్యంలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం
– సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య
కాకతీయ, గజ్వేల్ :గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ కళ్యాణ్ కర్ పద్మాబాయి నర్సింగ్ రావు లను మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గజ్వేల్ పట్టణ కమిటీ, తెలంగాణ ఆర్పీల సంఘం (సిఐటియు) గజ్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం శాలువాలలో తో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నూతన పాలకవర్గానికి, చైర్మన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రంగారెడ్డి, పట్టణ కార్యదర్శి రాజు, ఆర్పీల సంఘం జిల్లా కార్యదర్శి సుభద్ర, పట్టణ కార్యదర్శి కల్పన, నాయకులు పద్మ, సంధ్యా, మనోహరి, మున్సిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బచ్చలి కుమార్, మైస స్వామి పొన్నాల స్వామి, దయ్యాల కుమార్ తదితరులు పాల్గొన్నారు


