చైనా మాంజాపై ఉక్కుపాదం!
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. పక్షులతో పాటు ప్రజల ప్రాణాలకు కూడా చైనా మాంజా తీవ్ర ప్రమాదంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. సింథటిక్ దారం, గాజు పొడి కలిపిన చైనా మాంజా వల్ల పక్షుల మెడలు, రెక్కలు తెగిపోవడమే కాకుండా, మనుషులకు కూడా తీవ్ర గాయాలు అవుతున్నాయని తెలిపారు. యువత ఆకర్షణకు లోనై ఇలాంటి ప్రమాదకర దారాలను వాడకూడదని సూచించారు. చట్టవిరుద్ధంగా చైనా మాంజా విక్రయాలు జరిగితే జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా చైనా మాంజా విక్రయాలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.


