కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఆయుర్వేద వైద్యంతో కొన్ని మొండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చనని పలువురు ఆయుర్వేద వైద్యులు సూచించారు.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాల ఏరియాలో 10వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా మంగళవారం ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ శిబిరంలో పలువురు వైద్యులు ఆయుర్వేదం ప్రాముఖ్యత అవగాహన యోగా ప్రదర్శన జీవనశైలి సంబంధిత రుగ్మతల గురించి వివరించారు. చర్మ రోగాలు, వాత రోగాలు, స్త్రీ సంబంధిత రోగాలు, శ్వాస, కాస అర్ష రోగాలకు సంబంధించి మొత్తం 320 మంది రోగులను పరీక్షించి ఆయుర్వేద మందులు ఇవ్వటం ఇవ్వడం జరిగింది.
అనంతరం ఆయుష్ యోగా ఇంస్ట్రుక్టర్స్ ద్వారా కొన్ని ఆసనాలు చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. శిబిరం ముగిసిన అనంతరం
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల చుంచుపల్లి యోగ ఇన్స్ట్రక్టర్ కమలా రాణి కొచ్చెర్ల టైటీసీసీ ఉమ్మడి జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఆయుర్వేద డాక్టర్స్ సిబ్బంది అందరికీ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
నైనిక రిజ్వనా ప్రకృతి హరిత దీక్షరాలు డాక్టర్స్ అందరికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ డాక్టర్ వెంకటేశ్వర రావు, డిపిఎం డాక్టర్ మహేష్ గౌడ్, శిబిరం ఇంచార్జ్ డాక్టర్ లావణ్య, మాజీ కౌన్సిలర్ బలిశెట్టి సత్యభామ, వైద్యులు జి.అరుణ, ఉషా రాణి, సుందర్, జయ, విజయశ్రీ, శ్రీదేవి, పవని, గీతా మాధురి, ఫార్మాసిస్టులు వీరయ్య, రామకృష్ణ, సంతోష్, రేణుక, సాంబశివరావు, ఎస్.ఎన్.ఓ రవి, యోగా ఇన్‌స్ట్రక్టర్లు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.


