ఇద్దరు ఎస్ఐలపై ఛీటింగ్ కేసు నమోదు.
మహిళను నమ్మించి రూ. 1.82 కోట్లు వసూలు …
వ్యాపారంలో అధిక లాభాలిప్పిస్తామని మోసం.
ఎస్సై మహేష్ తనను ప్రేమిస్తున్నాను అని చెప్పి శారీరకంగా వాడుకుని తన అకౌంట్ లోని డబ్బులు తీసుకున్నారని పిర్యాదు…
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: లాభాలిప్పిస్తామని ఓ మహిళ వద్ద సుమారు రూ 2కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి ఆ తరువాత ఆమెను ఇబ్బందులకు గురి చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
సారపాకకు చెందిన భూక్యా కుమారి అనే మహిళ వద్ద ఖమ్మంకు చెందిన ఎస్ఐలు మహేష్, రాణాప్రతాప్ లు రూ 1.82 కోట్లు వ్యాపారం చేద్దామని తీసుకున్నారు. పెట్టిన పెట్టుబడికి 35శాతం అధికంగా కొద్ది కాలవ్యవధిలోనే లాభాలు వస్తాయి అంటూ ఆమెను నమ్మించారు. 2023లో భద్రాచలంలో ఎస్ఐగా పనిచేస్తున్న ఎస్ఐ మహేష్ సారపాకకు చెందిన భూక్యా కుమారితో పరిచయం ఏర్పడింది ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారానికి పెట్టుబడి పెట్టామని కోరారు. మహేష్ తన సోదరుడైన ఎస్ఐ రాణాప్రతాప్ తో కలిసి ఆమెను నమ్మించి రూ 1.82 కోట్లు పెట్టుబడి పెట్టించారు. ఇందులో మహేష్, రాణాప్రతాప్ తండ్రి చంద్రయ్య కూడా భాగమై ఉన్నాడు. ఈ ముగ్గురు కలిసి కుమారి తో పెట్టుబడి పెట్టించారు రూ 1.82 కోట్లు ఎప్పుడు అడిగిన ఇవ్వకుండా దాటవేత వైఖరి అవలంభిస్తున్నారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బుల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం రాకపోవటంతో సోమవారం కుమారి తమ వద్ద ఉన్న ఆధారాలతో బూరంపాడు పోలీసులను ఆశయించి ఫిర్యాదు చేసింది.
పిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు


