బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చాపలమడుగు రామ్మూర్తి
కాకతీయ, జూలూరుపాడు: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీగా ఉన్న మండల అధ్యక్ష పదవులకు జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు కొత్త అధ్యక్షులు నియమించారు. అందులో భాగంగా జూలూరుపాడు మండలంలో పార్టీ కోసం పనిచేసిన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన చాపల మడుగు రామ్మూర్తిని నియమించారు.కానీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఆ కమిటీని రద్దు చేశారు. తాజాగా ఖాళీగా ఉన్న మండలాల్లో అధ్యక్షులుగా నియమించుకోండి అని రాష్ట్ర నాయకత్వం ఆదేశించడంతో ఈ పదవి మరలా చాపల మడుగు రామ్మూర్తికే వరించింది. ఈ సందర్భంగా చాపలమడుగు రామ్మూర్తి మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారము నడుచుకుంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలకు 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, మండల కేంద్రంలో ఉన్న సమస్యల గురించి అధికారులను నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మండల అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


