epaper
Tuesday, March 3, 2026
epaper

మార్పు..మార్కు..!

మార్పు..మార్కు..!
వ్యూహాత్మ‌కంగా కాంగ్రెస్ డీసీసీ ప‌ద‌వుల‌కు నియామ‌కం
ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ రీ సెట్
కీలక నేతలకే అధ్య‌క్ష బాధ్య‌త‌లు

   

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌ పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టింది. జిల్లా స్థాయిలో పార్టీని మళ్లీ చైతన్య పరచడానికి కేడర్‌కు ఊపునివ్వడానికి రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాజాగా ఐదు కీలక నియామకాలను చేసింది. కరీంనగర్ జిల్లా, కార్పొరేషన్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు కొత్త డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

వ్యూహాత్మ‌కంగా నియామ‌కాలు..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకురావడానికి హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జిల్లాల వారీగా ప్రభావం ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ కేడర్‌ను మళ్లీ చైతన్యవంతం చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మెడిపల్లి సత్యం నియమించబడ్డారు. ప్రాంతీయంగా చురుకైన నేతగా పేరున్న ఆయన నాయకత్వం జిల్లా స్థాయి కార్యకలాపాలకు బలం చేకూర్చనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలు వీ. అంజన్ కుమార్‌కు అప్పగించారు. నగర రాజకీయాలపై అనుభవం కలిగిన అంజన్ నియామకం పట్టణ కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే జగిత్యాల జిల్లాలో గజెంగి నందయ్యకు డీసీసీ బాధ్యతలు అప్పగించారు. కేడర్‌ను సమీకరించడంలో నందయ్య కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్లలో సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. యువతలో ఆయనకు ఉన్న ఆదరణ, స్థానిక పరిభాషలో ఆయన స్థానంతో జిల్లా కాంగ్రెస్‌కు కొత్త ఊపు రావచ్చని అంచనాలు వ్య‌క్తం అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. జిల్లాలో మండల స్థాయి సమన్వయం బలహీనంగా ఉన్న నేపథ్యంలో రాజ్ ఠాకూర్ నాయకత్వం పార్టీ పునర్‌వ్యవస్థీకరణకు దోహదం చేయనుందని హైకమాండ్ భావిస్తోంది. ఉమ్మ‌డి జిల్లాల్లో కొత్త బాధ్యతలతో ముందుకు వచ్చిన నేతల నియామకాలు గ్రామ, మండల స్థాయిలో కాంగ్రెస్ కార్యకలాపాలకు కొత్త ఊపు తీసుకురావచ్చని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

వేగం పెంచాలనే …

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొత్త అధ్యక్షుల నియామకం ద్వారా కేడర్‌లో కొత్త ఉత్సాహం రేకెత్తించడంతో పాటు గత కొంతకాలంగా నిలిచిపోయిన జిల్లాస్థాయి కార్యకలాపాలకు మళ్లీ వేగం తీసుకురావాలనే పార్టీ లక్ష్యం కనిపిస్తోంది. ఈ మార్పులతో జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానికంగా ప్రభావం ఉన్న నేతలకు బాధ్యతలు అప్పగించడం ద్వారా గ్రామీణ స్థాయి నుండి నగర స్థాయి వరకు పార్టీ నిర్మాణం చురుకుదనాన్ని సంతరించుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు ఎనిమిది మందిని బైండోవర్ చేసిన...

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జిల్లాలో...

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ కాకతీయ, కరీంనగర్ : జనవరి...

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి కాకతీయ, వేములవాడ...

పోలీసులు మీకోసం అను శీర్షికన

పోలీసులు మీకోసం అను శీర్షికన -పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన...

శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు

శిశు మందిర్‌లో సీఏ కోర్సుపై అవగాహన సదస్సు కాకతీయ, కరీంనగర్ : స్థానిక...

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి

విన్న‌వించాం..ప‌రిష్క‌రించండి ఉమ్మడి జిల్లాల్లో ప్రజావాణికి విన‌తుల వెల్లువ‌ అర్జీల పెండింగ్‌కు నో నిర్ణీత గడువులో పరిష్కారం...

వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి

వేములవాడ చైర్మన్ పదవీకాలంపై స్పష్టత ఇవ్వాలి ఫిబ్రవరి సమావేశం ఎందుకు నిర్వహించలేదు ‘చెరో రెండున్నర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img