
కాకతీయ, జూలూరుపాడు: మండలంలోని పడమట నర్సాపురం గ్రామం వద్ద అతివేగంతో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొట్టింది. స్థానికులు కథనం ప్రకారం.. ఖమ్మం నుండి కొత్తగూడెం వైపు ప్రయాణిస్తున్న కారు మండలంలోని పడమట నర్సాపురం గ్రామం వద్ద అతివేగంగా వచ్చి అదుపు తప్పు రోడ్ పక్కన ఉన్న విద్యుత్ స్థంభాన్ని, పక్కనే ఉన్న కిలోమీటర్ మైలు రాయిని ఢీ కొని పల్టీ కొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్థంభం విరిగిపోయినది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్పగాయలు అయ్యాయని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సుమారు ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


