సీఎం దిష్టిబొమ్మ దహనానికి అనుమతి లేదు
బీఆర్ఎస్ ధర్నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల నినాదాలు
కాకతీయ, మణుగూరు : సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్ స్పష్టం చేశారు. ఆదివారం బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంటే, రాజకీయ లబ్ధి కోసం కొందరు అశాంతి సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే, పార్టీ శ్రేణులు శాంతియుతంగా అడ్డుకుంటాయని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇటువంటి చర్యలకు మద్దతు ఇవ్వకుండా చైతన్యవంతులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం *మణుగూరు*లో జరిగింది.


