కాకతీయ, కొత్తగూడెం : ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కోల్మెన్స్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ బి జనకప్రసాద్‌పై ఏఐటీయూసీ నాయకులు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజు హెచ్చరించారు.
గురువారం కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద ఉన్న చౌరస్తాలొ ఐఎన్‌టీయూసీ నాయకుల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏఐటీయూసీ నాయకులు వ్యక్తిత్వ హననం చేయడం మంచిది కాదని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐఎన్టీయూసీ సహించబోదని హెచ్చరిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతంబర్రావు, జనరల్ సెక్రెటరీ ఆల్బర్ట్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ రాజేశ్వరరావు, సెంట్రల్ కమిటీ బ్రాంచ్ కమిటీ, ఫిట్ సెక్రెటరీలు, బ్రాంచ్ సెక్రటరీలు, ఆల్ కమిటీ మెంబర్స్, పాల్గొన్నారు.


