కాంగ్రెస్‌లో బీఆర్ ఎస్ నేతల చేరిక
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం పత్తికుంటపల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు శనివారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి పార్టీకి స్వాగతం పలికారు.కాంగ్రెస్‌లో చేరిన వారిలో జుట్టు భాస్కర్, జుట్టు శేఖర్, మధు, నరేష్, సింగిరెడ్డి మనోహర్ రెడ్డి, బట్టు లక్ష్మణ్, నవీన్, అశోక్, ఓరుగంటి రవి, రాజు, వినోద్, పర్శరాములు, జేరిపోతుల అభిలాష్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ బలం పెంపునకు కీలకమని, కాంగ్రెస్ విజయం కోసం అందరూ ఏకతాటిపై పనిచేయాలని సూచించారు. పంచాయతీలను కైవసం చేసుకున్నప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉట్కూరి వెంకట రమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు బి. తిరుపతిరెడ్డి, నాయకులు ఎల్క రామస్వామి, నగేష్, జి. నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


