- చికిత్స పొందుతూ మహిళ మృతి
- ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
కాకతీయ, బయ్యారం : బయ్యారం మండల కేంద్రానికి సమీపంలో బొలెరో, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందగా, ఆటో డ్రైవర్ కు తీవ్రగాయలయ్యాయి. మంగళవారం జగత్రావుపేట నుంచి బయ్యారం మండల కేంద్రానికి ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో గట్టు ముసలమ్మ పరిసర ప్రాంతంలో ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తాటిపాముల శ్రీమంతమ్మ, ఆటో డ్రైవర్ వీరన్నకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో ఇద్దరిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ క్షతగాత్రురాలు తాటిపాముల శ్రీమంతమ్మ (58) మృతి చెందిందని వైద్యులు తెలిపారు. సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


