డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వణికేలా జైష్ కుట్ర!
ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం
బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం
ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక
కాకతీయ, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్ డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసిందని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఈ తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం గమనార్హం. 1992లో ఇదే రోజున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ ఉద్దేశమని అరెస్టయిన అనుమానితులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6ను ప్రతీకారం దినంగా నిర్ణయించి దాడి చేయాలని వారు సిద్ధపడ్డారు.
ఐదు దశల ప్రణాళిక..
దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్ర మాడ్యూల్ రూపొందించిన ఐదు దశల ప్రణాళికను గుర్తించాయి. మొదటగా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనుబంధ వ్యక్తులతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారిలో కొంతమంది వైద్యులు, టెక్నికల్ నిపుణులు కూడా ఉన్నారని సమాచారం. రెండవ దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి కావలసిన ముడిసరుకులు సేకరించారు. మూడవ దశలో పేలుడు పరికరాలను తయారు చేసి, ఢిల్లీలో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం, నాలుగవ దశలో అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయడం, చివరగా డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి దాడులు జరిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.
ఎర్రకోట సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు మొదట చిన్న ఘటనగా భావించినా, విచారణలో అది పెద్ద కుట్రకు తలుపులు తెరిచింది. ఆ కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిఘా సంస్థలు ఈ మాడ్యూల్‌కు చేరుకున్నాయి. తద్వారా దేశ రాజధానిపై ముసుగులో సాగిన ఉగ్ర పథకం బహిర్గతమైంది. మొదట ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఆగస్టు నెలలోనే దాడులు జరపాలని నిర్ణయించిందని, కానీ అంతర్గత సమన్వయ లోపాల వల్ల ప్రణాళిక ఆలస్యం కావడంతో చివరికి డిసెంబర్ 6న లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు తెలిపింది.
కాగా, ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే అరెస్టయిన అనుమానితుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే మరోవైపు దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు సమూలంగా నిర్వీర్యం చేయడానికి చర్యలు చేపట్టారు.ఎర్రకోట పేలుడు దర్యాప్తులో బయటపడిన ఉగ్ర పథకం
బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం
ఐదు దశల్లో అమలు చేయబోయిన దాడి ప్రణాళిక
కాకతీయ, జాతీయం : దేశ రాజధానిని వణికించే కుట్రను నిఘా సంస్థలు సమయానికి ఛేదించాయి. ఇటీవల ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు విచారణలో సంచలన వివరాలు బయటపడ్డాయి. ఈ ఘటన వెనుక జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్ర మాడ్యూల్ ఉందని అధికారులు వెల్లడించారు. ఈ మాడ్యూల్ డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపాలని ప్రణాళిక వేసిందని దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు ఈ తేదీని వ్యూహాత్మకంగా ఎంచుకోవడం గమనార్హం. 1992లో ఇదే రోజున అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. ఆ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడమే తమ ఉద్దేశమని అరెస్టయిన అనుమానితులు విచారణలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 6ను ప్రతీకారం దినంగా నిర్ణయించి దాడి చేయాలని వారు సిద్ధపడ్డారు.
ఐదు దశల ప్రణాళిక..
దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్ర మాడ్యూల్ రూపొందించిన ఐదు దశల ప్రణాళికను గుర్తించాయి. మొదటగా, జైష్-ఎ-మొహమ్మద్ మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ అనుబంధ వ్యక్తులతో ప్రత్యేక మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్నవారిలో కొంతమంది వైద్యులు, టెక్నికల్ నిపుణులు కూడా ఉన్నారని సమాచారం. రెండవ దశలో హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల నుంచి ఐఈడీల తయారీకి కావలసిన ముడిసరుకులు సేకరించారు. మూడవ దశలో పేలుడు పరికరాలను తయారు చేసి, ఢిల్లీలో లక్ష్యంగా పెట్టుకున్న ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం, నాలుగవ దశలో అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయడం, చివరగా డిసెంబర్ 6న ఢిల్లీలో ఆరు నుంచి ఏడు ప్రదేశాల్లో ఒకేసారి దాడులు జరిపే విధంగా ప్రణాళిక సిద్ధమైంది.
ఎర్రకోట సమీపంలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు మొదట చిన్న ఘటనగా భావించినా, విచారణలో అది పెద్ద కుట్రకు తలుపులు తెరిచింది. ఆ కారు నుంచి సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా నిఘా సంస్థలు ఈ మాడ్యూల్‌కు చేరుకున్నాయి. తద్వారా దేశ రాజధానిపై ముసుగులో సాగిన ఉగ్ర పథకం బహిర్గతమైంది. మొదట ఈ ఉగ్రవాద మాడ్యూల్ ఆగస్టు నెలలోనే దాడులు జరపాలని నిర్ణయించిందని, కానీ అంతర్గత సమన్వయ లోపాల వల్ల ప్రణాళిక ఆలస్యం కావడంతో చివరికి డిసెంబర్ 6న లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తు తెలిపింది.
కాగా, ఈ వివరాలు వెలుగులోకి రావడంతో ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిఘా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే అరెస్టయిన అనుమానితుల నుండి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. అలాగే మరోవైపు దేశ భద్రతకు ముప్పుగా ఉన్న ఈ ఉగ్ర మాడ్యూల్‌ను అధికారులు సమూలంగా నిర్వీర్యం చేయడానికి చర్యలు చేపట్టారు.