epaper
Monday, March 2, 2026
epaper

మున్సిపల్ పోరులో బీజేపీదే విజయం!

మున్సిపల్ పోరులో బీజేపీదే విజయం!
రాష్ట్రంలో అనుకూలంగా మారిన రాజకీయ వాతావరణం
కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్క‌య్యాయి..
అత్యధిక స్థానాల్లో గెలిచితీరుతాం
కేంద్ర నిధులతో కార్పొరేషన్ల అభివృద్ధి హామీ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం నెలకొన్నదని స్పష్టం చేశారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాంచందర్ రావు… ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి అవసరమైన అధిక నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో కీలకమని ఆయన గుర్తు చేశారు. ఆ విషయాన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకొని బీజేపీ అభ్యర్థులను గెలిపించి కార్పొరేషన్‌కు పంపించాలని కోరారు. ప్రజాసేవే బీజేపీ లక్ష్యమని, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతామని తెలిపారు.

కాంగ్రెస్–బీఆర్ఎస్‌లది నాటక రాజకీయం

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బయటకు శత్రువుల్లా నటిస్తున్నప్పటికీ లోపల మాత్రం పరస్పరం సహకరించుకుంటున్నాయని రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తమ వైఫల్యాలు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ రెండు పార్టీలు బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వమే కాపాడిందని ఆయన ఆరోపించారు. అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులను రక్షించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని రాంచందర్ రావు అన్నారు. కీలక కేసులకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, డీఎన్‌ఏ రిపోర్టులు, డిజిటల్ ఆధారాలు ఉన్న చోటే అగ్నిప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. గతంలో సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంతో పోలికలు కనిపిస్తున్నాయని, ఈ రెండు ఘటనలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై అనుమానాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతున్నప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితాలు రాలేదని రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ పేరుతో ఈ వ్యవహారాన్ని కావాలనే నాన్చుతున్నదని ఆరోపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలను నాశనం చేయడానికే జరిగిందేమోనన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ కేసులో అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. అందువల్ల ఈ అగ్నిప్రమాదంపై స్వతంత్ర, నిష్పక్షపాత దర్యాప్తు తప్పనిసరిగా జరగాల్సిందేనని బీజేపీ స్పష్టంగా డిమాండ్ చేస్తోందన్నారు. నిజాలు బయటపడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు కె.వి.రంగా కిరణ్, బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు

ఎస్సీ వర్గీకరణ పోరులో అమరవీరులకు జోహార్లు సింగరేణిలో ఎమ్మార్పీఎస్ గద్దె వద్ద నివాళులు త్యాగాలు...

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..!

బొగ్గు–ఇసుక లారీల బీభత్సం..! మణుగూరు–బయ్యారం రహదారి ధ్వంసం దుమ్ము ధూళితో గిరిజన బిడ్డల అనారోగ్యం ప్రజల...

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం

అదుపుతప్పిన ఇసుక ట్రాక్టర్ – డ్రైవర్ దుర్మరణం నాగులవంచ వద్ద తెల్లవారుజామున ప్రమాదం ఓవర్‌టేక్...

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే

వెలుగుమట్ల బాధితులపై ముమ్మర సర్వే 21 మంది తహశీల్దార్లతో యుద్ధప్రాతిపదికన సర్వే ఖమ్మం జిల్లాకు...

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ

వెలుగుమట్ల బాధితులకు బీఆర్ఎస్ అండ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో భోజనాల పంపిణీ కాకతీయ,...

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ

సీఎం రేవంత్ రెడ్డికి సన్మానసభ పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : ఎస్సీ...

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు

భూదాన్ వ్యవహారంలో విపక్షాలే అభాసు పేదల పేరుతో రాద్ధాంతం చేశారు ఏజెంట్ల మోసాలపై బాధితులకు...

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం

మోదీ పాలనలో దేశానికి ప్రమాదం కార్పొరేట్ల కోసమే కేంద్రం విధానాలు సీపీఐ (ఎం) పొలిట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img