- నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ
కాకతీయ, ఖమ్మం టౌన్ : బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రకటించిన జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్య నారాయణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవ రావు ఆధ్వర్యంలో ఖమ్మంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ చెప్పిన ఆరు హామీలు అమలు చేయలేదన్నారు. గతంలో తెరాస ప్రభుత్వం పాలనలో ఉన్నపుడు ప్రజలను హామీల విషయంలో మోసం చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏదో చేస్తుందని గెలిపిస్తే. ప్రజలను హామీల పేరుతో మోసం చేసిందన్నారు. రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తారని తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొంగల సత్యనారాయణ, సన్నె ఉదయ ప్రతాప్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు గుత్తా వెంకటేశ్వర్లు, నాయుడు రాఘవరావు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా, వీరవెల్లి రాజేష్, నకిరికంటి వీరభద్రం, జిల్లా కార్యదర్శులు రాంశెట్టి నాగేశ్వరరావు, కొంచెం కృష్ణారావు, పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవికుమార్, జిల్లా కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ, నాయకులు డోకుపర్తి రవీందర్, మండల అధ్యక్షులు గడిల నరేష్, గుత్తా వంశీ, వాగదాని రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


