8న వరంగల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలి
బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్
కాకతీయ, వరంగల్ సిటీ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు గురువారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు వరంగల్ నగర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడి జిల్లా పర్యటన పార్టీ బలోపేతం దిశగా కీలక మలుపుగా నిలుస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయడం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి రాకతో జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 8వ తేదీన వరంగల్ జిల్లాకు చేరుకోనున్న రామచందర్ రావుకు వరంగల్ చౌరస్తా నుంచి రాజశ్రీ గార్డెన్ వరకు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా నాయకులు, కార్యకర్తలతో సమావేశమై పార్టీ పటిష్టత, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారని తెలిపారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని బీజేపీ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు, బూత్ స్థాయి కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, పార్టీ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షుడి పర్యటనను అత్యంత విజయవంతం చేయాలని గంట రవికుమార్ కోరారు. రాష్ట్ర అధ్యక్షుడి రాక జిల్లా బీజేపీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి, పార్టీ ఐక్యతను చాటి చెప్పే కార్యక్రమంగా నిలవాలని అన్నారు.


