కాకతీయ, బయ్యారం: మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగాపై మండల స్థాయి కార్యశాల కార్యక్రమాన్ని. సోమవారం నిర్వహించారు.మండల బీజేపీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది . కార్యక్రమం నాకు ముఖ్య అతిధిగా రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి భూక్యా శ్రీనివాస్ హాజరై, కార్యశాలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురష్కరించుకొని పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి హర్ ఘర్ తిరంగ యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తూ దేశ సమైక్యత, సమగ్రతకోసం ప్రతిజ్ఞ చేయాలన్నారు.భారత ప్రధాని నరేంద్రమోడి దృడమైన సంకల్పం,నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల దగ్గెర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడిఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సింధూర్ గొప్ప విజయం సాధించిందని అన్నారు.
ఈ సందర్బంగా పార్టీ సీనియర్ నాయకులు వన్నం రామారావు మాట్లాడుతూ మోడీ బలమైన నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ అఖండ విజయం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ పతాకంతో దేశభక్తి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు.హర్ ఘర్ తిరంగా అభియాన్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడాలేకుండాప్రతీ ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు.
త్రివర్ణపతాకం మనల్ని ఐక్యంగా కలిపి ఉంచుతుందని పేర్కొన్నారు.మన భద్రతబలగాలను ప్రశంశిస్తూ బలిదానాలమైన సామగ్రి ఆయుధ ప్లకార్డులు ప్రదర్శించలన్నారు.తిరంగ ర్యాలీలు నిర్వహించలన్నారు.అలాగే స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించలన్నారు. ఈ కార్యక్రమంలో ఊకె రామ్మూర్తి,కురియాల చంద్రయ్య,డెరంగుల రాంబాబు, జెర్రిపోతుల శ్రీనివాస్,మోకాళ్ళ విశవేశ్వరరావు,మేడి ఉపేంద్ర,బీజ్జా కనకయ్య, గాంధీ,మందుల వెంకటనారాయణ,తదితరులు పాల్గొన్నారు.


