పాతర్లపల్లి లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ
పేదల సొంతింటి కల కాంగ్రెస్ తోనే సాధ్యం
కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు కోడం రజిత
కాకతీయ, జమ్మికుంట :ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన రెండు ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ముఖ్య అతిథిగా మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కోడం రజిత – శ్రీనివాస్ హాజరై రాం స్వరూప, మడికొండ రవి ఇండ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కోడం రజిత మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోందని అన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కామిశెట్టి శ్రీకాంత్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బైరెడ్డి కొండల్ రెడ్డి తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


