కాకతీయ, కొత్తగూడెం రూరల్: ఏ వన్ బిజినెస్ ఎంటర్ ప్రిన్యూర్ అవార్డ్స్-2025( సెకండ్ ఎడిషన్)అభినవ ఆర్ట్స్ అకాడమీ అధినేత అభినవ్ సారథ్యంలో హైదరాబాదులోని మాదాపూర్ లోని ఆశ్రయ్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగిన అవార్డ్స్ ప్రధానం కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సమాజసేవకుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దెల శివ కుమార్ కు “మెగా మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ ఆఫ్ -2025 ఉత్తమ సేవా రత్న అవార్డుతో” ఘనంగా సత్కరించి మెమొంటో, సర్టిఫికెట్ ను ప్రదానం చేశారు.
ఈ మేరకు మద్దెల శివకుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తనకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని, తాను విద్య సాంస్కృతిక, కళా, ఆధ్యాత్మిక రంగాలతో పాటు దళితుల చైతన్యం, అంబేద్కర్ ఆశయాల సాధన సామాజిక సేవా రంగాలలో 40 ఏళ్లుగా అందిస్తున్న విశిష్ట సేవలు గుర్తించి అవార్డు ఇచ్చారని తెలిపారు.
తనకు ఈ అవార్డు రావడం పట్ల సమీర్, రమేష్ నాయుడు, అభినవ్ లతోపాటు, చాముండేశ్వరి అనుగ్రహ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కృష్ణచాముండేశ్వర మహర్షి, శ్రీ సాయి అసోసియేట్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కెవి నాగలక్ష్మి, ఈవెంట్ మేనేజర్ అభినవ్, సినీ నటులు, ఆజాద్ ఫౌండేషన్ అధినేత అప్సర్ ఆజాద్, లిటిల్ హార్ట్స్ మూవీ ఫేం బేబీ నజ్రీన్, సినీ నటులు చిత్రపురి సొసైటీ కార్యదర్శి తాండూర్ ధనరాజ్, ఆదర్శ ఫౌండేషన్ అధినేత కుసుమ భోగరాజు, మేము సైతం యువసేన ఫౌండర్ అధినేత్రి చకిలం స్వప్న, సిద్ధి వినాయక్, రియల్ ఎస్టేట్ నుండి రాజేష్, శంకర్ తదితరులు అభినందించినట్లుగా తెలిపారు.


