విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పోలీసు వాహనాలను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం : జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వాహనాలను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే క్రమంలో వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు మంచిగా ఉండేలా చూసుకోవాలని, విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవింగ్ చేసే సమయాల్లో పాటించే నియమ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని తెలిపారు. అకస్మాత్తుగా వాహనం ఆగిపోయినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ ఆటంకాలను నివృత్తి చేసుకోగలిగే కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు. క్రమశిక్షణ, నిబద్ధతతో పని చేసే వారికి పోలీస్ శాఖలో మంచి పేరు లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ మోటారు వాహనాల అధికారి సుధాకర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


