బి అలర్ట్…
జిల్లా బిఆర్ఎస్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని చెంచుపల్లి మండలం లో ఉన్న జిల్లా టిఆర్ఎస్ కార్యాలయం వద్ద ఆదివారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జిల్లాలో కాంగ్రెస్కు టిఆర్ఎస్కు మధ్య జరుగుతున్న వైరం నేపథ్యంలో మణుగూరు ప్రాంతంలో ఉన్న టిఆర్ఎస్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలను తొలగించి ఫ్లెక్సీలకు నిప్పంటించిన కాంగ్రెస్ కార్యకర్తలు దాడిని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక ప్రకటనలో ఖండించారు. జరుగుతున్న దాడులను నివారించేందుకు ముందస్తుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు టిఆర్ఎస్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు భద్రాద్రి జిల్లా పోలీసులు ముందున్నారు.


