ఖమ్మం కలెక్టరేట్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కాకతీయ ఖమ్మం ప్రతినిధి: బతుకమ్మ వేడుకలు కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఆరో రోజు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అలిగిన బతుకమ్మ వేడుకలో మహిళా అధికారులు, సిబ్బందితో కలిసి సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…. అంటూ ఆట, పాటలతో ఎమ్మెల్యే సందడి చేశారు. కార్యక్రమంలో ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, మద్దులపల్లి మార్కెట్ కార్యదర్శి ఆంజనేయులు, వైరా మార్కెట్ కార్యదర్శి మొహసీన్ సుల్తానా, మార్కెటింగ్ శాఖ సిబ్బంది రామకృష్ణ, సాదిక్, యశోద, పద్మ, శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


