epaper
Sunday, March 1, 2026
epaper

*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు*

*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు*

*ఆయ‌న‌తో పాటు మ‌రో 36మంది మావోయిస్టు నేత‌లు*

*మ‌రి కొద్దిసేప‌ట్లో డీజీపీ ప్రెస్‌మీట్ నిర్వ‌హించే అవ‌కాశం*

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య తెలంగాణ డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన‌ట్లు స‌మాచారం. ఆయనతో పాటు మరో 36 మంది మావోయిస్టు కేడర్ కూడా లొంగుబాట‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం డీజీపీ శివ‌ధ‌ర్‌రెడ్డి లొంగుపోయిన మావోయిస్టుల‌ను మీడియాకు చూప‌నున్న‌ట్లు స‌మాచారం. ఆజాద్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామరాజు జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శిగా ప‌నిచేస్తున్నారు. ఆయన స్వస్థలం ములుగు జిల్లాలోని మొద్దులగూడెం గ్రామం. ఆయన 1995 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. ఆజాద్ తలపై ప్రభుత్వం రూ. 20 లక్షల రివార్డు ప్రకటించింది. ఆజాద్‌తో పాటు డివిజన్ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేశ్, ఎర్రాలు మరియు మరో 30 మందికి పైగా మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోయిన వారిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇటీవల మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ మరియు పోలీసుల ఆపరేషన్ల నేపథ్యంలో, పలువురు మావోయిస్టు నేతలు లొంగుబాటుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన శాంతి చర్చల పిలుపు కూడా ఈ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. జనజీవనస్రవంతిలో కలిసేందుకు వచ్చిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img